రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వ విప్‌కు గాయాలు

  • జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారీపేట వద్ద ప్రమాదం
  • ప్రభుత్వ విప్ అడ్లూరి ప్రయాణిస్తున్న కారు బోల్తా
  • ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో ఘటన
  • విప్‌తో పాటు కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు  
జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఎండపల్లి మండలం అంబారీపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారికి కరీంనగర్‌లో చికిత్స అందిస్తున్నారు.

Adluri Laxman
Jagtial District
Telangana
Congress
Road Accident

More Telugu News